దగదర్తి పట్టణంలోని శ్రీ దత్త సాయి బాబా మందిరంలో గురువారం శ్రీ సాయిబాబా కు విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారికి అభిషేకం, అర్చన, సేజ్ హారతి తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. ప్రత్యేక పుష్ప అలంకరణలో శ్రీ సాయిబాబా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.