బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో శుక్రవారం కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలను ఏర్పాటు చేశారు. ఈ పోటీల్లో అత్యున్నత ప్రతిభ సాధించిన విద్యార్థినిలకు బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సుజాత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.