ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడానికి ఉపాధ్యాయులు-తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహించినట్లు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తెలియజేశారు. ఈ సందర్భంగా శనివారం నగరి మున్సిపాలిటీ పరిధిలోని ఏకాంబర కుప్పం జిల్లా పరిషత్ హైస్కూల్లో శనివారం నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులకు రంగోళి, టగ్ ఆఫ్ వార్ వంటి క్రీడలు నిర్వహించారు.