నగరి నియోజకవర్గంలోని పలు మండలాలలో ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చొరవతో తాగునీటి బోర్లను వేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు. ఎన్నికల హామీలలో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే నెరవేరుస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు మంగళవారం తెలియజేశారు. బోర్లను వేయడమే కాకుండా వాటికి త్వరితగతిన మోటార్లను బిగించి ప్రజలకు నీరు అందించడం జరుగుతుందని వారు తెలిపారు.