నగరి రూరల్ మండలం తడుకు గ్రామంలో గురువారం రాత్రి ఘర్షణలు జరిగి ద్విచక్ర వాహనాలను కాల్చివేసిన ఘటన శుక్రవారం ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వర్గం నాయకులు బైకులు కాల్చివేశారని మరోవర్గం ఆరోపించగా లేదు వారే చేశారని మరోవర్గం నాయకులు తెలిపారని స్థానికులు తెలియజేశారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.