మొగల్తూరు: నిర్మానుష్యంగా పేరుపాలెం బీచ్
మొగల్తూరు మండలంలోని పేరుపాలెం బీచ్ ఆదివారం నిర్మానుష్యంగా మారింది. కార్తీకమాసం ఆఖరి వారం కావడంతో పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారు. అధికారులు పర్యాటకులను, ప్రకృతి ప్రేమికులను బీచ్‌కు ఎవరినీ అనుమతించలేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో సముద్రపు కెరటాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. సముద్ర కెరటాలు సుమారు 100 మీటర్లు ముందుకు రావడంతో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.