రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ నివాసానికి రాష్ట్ర దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి శనివారం విచ్చేశారు. ఈ సందర్భంగా నారాయణ ఆయనకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికి సత్కరించారు. నెల్లూరు జిల్లాకు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలను చర్చించేందుకు ఆయన విచ్చేశారు.