నెల్లూరు: ప్రతి అర్జీపై వ్యక్తిగత శ్రద్ధ పెట్టాలి: కలెక్టర్
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అర్జీలను వ్యక్తిగత శ్రద్ద పెట్టి పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ ఆదేశించారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులతో కలసి నిర్వహించి పలు సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.