పలమనేరు పట్టణంలోని కనకదుర్గ ఆలయంలో బుధవారం రాత్రి వైభవంగా దీపం పూజలు నిర్వహించారు. మహిళలు దీపాలతో భారీగా ఆలయానికి పోటెత్తారు. ప్రత్యేక పూజలు చేశారు. ఓం శక్తి దీక్ష దారులు గ్రామోత్సవం నిర్వహించారు. స్థానిక శ్రీ కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయం నుంచి ప్రారంభమై కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకున్నారు. కనకదుర్గమ్మను పల్లకిపై కొలువు తీర్చి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.