రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుపై వైసీపీ నాయకులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే వేంకట గౌడ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున విద్యుత్ శాఖ ఏడీయూ కార్యాలయం వద్ద చేరుకుని నిరసన తెలిపారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి, ఆరునెలల్లో విద్యుత్ ఛార్జీల మోత మోగిస్తున్నారని మండిపడ్డారు.