చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారిని ఒడిశా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీపీ రౌత్రే శనివారం సాయంత్రం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ తీర్థ ప్రసాదాలతో పాటు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు వాసు, బాలాజీ నాయుడు పాల్గొన్నారు.