చిత్తూరులో ఆదివారం నిర్వహిస్తున్న జిల్లా కమిటీ సమీక్షా సమావేశానికి విచ్చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని పులిచెర్ల మండలం కొత్తపేట టిడిపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇన్ ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి తో కలిసి టిడిపి నాయకులు గోపి నాయుడు, కిషోర్ నాయుడు, తేజ నాయుడు, సురేష్ మంత్రిని కలిసి టిడిపి పార్టీ సభ్యత్వ నమోదు గురించి వివరించారు.