పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం పులిచెర్ల జడ్పీ ఉన్నత పాఠశాలను శుక్రవారం సి ఎం ఓ ఉదయ్ లక్ష్మి తనిఖీ చేశారు.పాఠశాలలో విద్యార్థుల హాజరు విద్యాబోధన మధ్యాహ్నం భోజనం తదితర వాటిని పరిశీలించారు.పాఠశాలలో శనివారం జరుగు మెగా పేరెంట్స్ మీటింగ్ పై పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఏఎస్ఓ నాగేశ్వరరావు ఎంఈఓ సిద్ధరామయ్య హెచ్ఎం సయ్యద్ షావలి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.