అఖిల భారత గోసంరక్షణ మహాసంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి అయూబ్ ఖాన్ నియామకమైయ్యారు. ఈ సందర్బంగా బుధవారం పుంగనూరు పట్టణం కొత్తయిండ్లు సాయిబాబా మందిరంలో సమావేశం నిర్వహించి పట్టణానికి చెందిన భక్తవత్సల రాజు, ముత్యాలు, ఎర్రప్పయాదవ్ లు పెద్దలు నియామక పత్రాన్ని అయూబ్ ఖాన్ కు అందజేశారు. అయూబ్ ఖాన్ మాట్లాడుతూ.. గో సంరక్షణకు ప్రజలందరి సహకారం అవసరమని కోరారు.