చిత్తూరు జిల్లా, పుంగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణంలో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల పాడి ఆవు మంగళవారం రాత్రి విద్యుత్ ఘాతానికి మృతి చెందింది. ఈ విషయం ఆలస్యంగా బుధవారం ఉదయం బాధిత రైతు శ్రీరాములు ద్వారా వెలుగులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా విద్యుత్ తీగలు ఈ ప్రాంతంలో నేలపై పడి ఉన్న విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానిక రైతులు ఆరోపించారు.