చిత్తూరు జిల్లా పుంగనూరు మండల పరిధిలోని పట్రపల్లి తాండ, జువ్వలదీన్నే ఓ తండా, నల్లగుట్లపల్లి తండాలలో శనివారం మధ్యాహ్నం ఒక గంట ప్రాంతంలో ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసుల ఆచారి ఆధ్వర్యంలో ఎక్సైజ్ సిబ్బంది నాటు సారా తయారీ స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 5400 లీటర్ల నాటు సారా బెల్లం ఊట ధ్వంసం చేసి 135 లీటర్ల నాటుసారాతో పాటు రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.