రేణిగుంట: హైవేపైకి వర్షపు నీరు.. వాహనదారులకు ఇక్కట్లు

66చూసినవారు
రేణిగుంట: హైవేపైకి వర్షపు నీరు.. వాహనదారులకు ఇక్కట్లు
రేణిగుంట మండలంలోని కరకంబాడి పంచాయతీ సమీపంలో కరకంబాడి-తిరుపతి హైవేపైకి వర్షపు నీరు మడుగులా వచ్చి చేరడంతో వాహన చోదకులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొండ ఊట నీరంతా రోడ్డుపైకి వచ్చి మడుగులా తయారయింది. దీంతో రాత్రి వేళల్లో కొందరు వాహన చోదకులు జారిపడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకొని మడుగును తొలగించాలని వాహన చోదకులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్