రొంపిచర్ల: లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం

79చూసినవారు
రొంపిచర్ల: లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరం
గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని రొంపిచర్ల మండల పీహెచ్ సీ డాక్టర్ దినేష్ కుమార్ నాయక్ అన్నారు. ఆరోగ్య కేంద్రంలో గురువారం ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. గర్భావతులకు వైద్య, ఆరోగ్య పరీక్షలు జరిపారు. శిశు సంరక్షణ, తల్లిపాలు ప్రాముఖ్యత, కుటుంబ నియంత్రణ, రక్తహీనతపై అవగాహన కల్పించారు. ఈ  కార్యక్రమంలో రాజేశ్వరి, కాంతమ్మ, పంకజ, సాయి పూజిత, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్