గత ప్రభుత్వ పాలనకు, ఈ ప్రభుత్వ పాలనకు పెద్ద తేడా లేకుండా విద్యాశాఖ అధికారులు అనాలోచిత నిర్ణయాలతో ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతున్నారని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఈశ్వర మహేంద్ర అన్నారు. ఉపాధ్యాయుల ఇబ్బందులను, ఈ విషయాలను ఉన్నతాధికారులకు తెలియజేయాలని కోరుతూ బుధవారం పులిచెర్లలో మండల విద్యాశాఖ అధికారులు సిద్ధరామయ్య, పోకల తాతయ్యకు వినతి పత్రం అందజేశారు.