పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం కొత్తపేటలో గురువారం దివంగత మాజీ ఎమ్మెల్యే నారా రామమూర్తి నాయుడు దశదిన కర్మ క్రియల సందర్భంగా ఆయన చిత్రపటానికి టిడిపి నాయకులు కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు లెక్కల ధనంజయ నాయుడు, గోపి నాయుడు మాట్లాడుతూ నారా రామ్మూర్తి నాయుడు మృతి అందరికీ తీరని లోటుని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.