నాయుడుపేట - పూతలపట్టు హైవే 6 లైన్ల రోడ్డు పనులు జరుగుతున్నాయి. తొట్టంబేడు మండలం పొయ్య కొత్తురు సమీపంలో గ్రామాలకు వెళ్లే సర్వీసు రోడ్డును తొలగించి కల్వర్టు నిర్మాణ పనులు చేపట్టారు. సగం నిర్మించి పనులను మధ్యలో ఆపేసారు. నిర్మాణపనుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో రాత్రివేళల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు కల్వర్టు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.