పిచ్చాటూరు ఆరణియార్ ప్రాజెక్ట్ లో చేపడుతున్న టూరిజం పనులు ట్యాంక్ లోపల జరుగుతున్నందున సత్వరం ఆపివేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, రైతు సంఘం నేత డా. టీ. జనార్ధన్ లు పేర్కొన్నారు. మంగళవారం సీపీఐ, రైతు సంఘం ప్రతినిధులు ప్రాజెక్టును సందర్శించి, చెరువు లోపల 2. కోట్ల తుడా నిధులతో జరుగుతున్న టూరిజం పనులను పరిశీలించారు. సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా చెరువులో పనులు చేపట్టరాదన్నారు.