నాయుడుపేట రైల్వేస్టేషన్ లో సోమవారం తెల్లవారుజామున రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. చెన్నై వైపు వెళ్ళే రైలు పట్టాలు దాటుతున్న వ్యక్తిని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నీలం రంగు జీన్ ప్యాంట్ ధరించాడు. మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.