తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన స్పోర్ట్స్ క్లబ్ ను సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ గురువారం ప్రారంభించారు. క్రికెట్, ఫుట్ బాల్ నెట్ ప్రాక్టీస్ చేసేందుకు స్పోర్ట్స్ క్లబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు. నెలవల సుబ్రహ్మణ్యం, విజయభాస్కర్ రెడ్డి, రఫీ, ఉయ్యాల ప్రవీణ్, పార్ధసారధి తదితరులు పాల్గొన్నారు.