నాయుడుపేట: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా శనివారం సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో 14, 15, 16తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆయన ఓ ప్రకటన ద్వారా హెచ్చరించారు. ఏదైనా అత్యవసర సేవలకు మున్సిపాలిటీ, సచివాలయం సిబ్బందిని సంప్రదించాలని కోరారు.