"గోవింద కోటి"ని రాసిన బెంగుళూరుకు చెందిన కుమారి కీర్తన

77చూసినవారు
మొట్టమొదటిసారిగా "గోవింద కోటి"ని రాసిన‌ విద్యార్థిని కుమారి కీర్తనకు మంగళవారం టీటీడీ శ్రీవారి బ్రేక్ దర్శనం కల్పించింది. బెంగుళూరుకు చెందిన ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కుమారి కీర్తన 10 లక్షల ఒక వెయ్యి 116 సార్లు గోవింద కోటిని రాసింది. కుమారి కీర్తన మీడియాతో మాట్లాడుతూ మా కులదైవం అయిన శ్రీవారి అనుగ్రహంతో గోవింద కోటి రాసే అవకాశం తనకు కలగడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్