నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం పరిధిలోని సీతారాంపురం మండలం ఘటిక సిద్దేశ్వరం లో శ్రావణ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకుడు కాశయ్య పూజారి తెలిపారు. మహిళలు, భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్రులు కాగలరని ఆకాంక్షించారు. భక్తుల కొరకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.