ముస్లిం, మైనార్టీలకు అండగా ఉంటా: ఎమ్మెల్యే కురుగొండ్ల

72చూసినవారు
ముస్లిం, మైనార్టీలకు అండగా ఉంటా: ఎమ్మెల్యే కురుగొండ్ల
వెంకటగిరి నియోజకవర్గంలోని ముస్లిం, మైనార్టీలకు తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అన్నారు. శుక్రవారం పట్టణంలోని 23 వార్డులో బొమ్మిడి కాలువ పక్కన ఉన్న పీర్లచావిడ వద్ద నూతనంగా నిర్మించనున్న షాపింగ్ కాంప్లెక్స్ భూమి పూజలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ముస్లిం, మైనార్టీల అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. రంజాన్ తోఫా వంటి పథకాలను ప్రభుత్వం తిరిగి ప్రారంభిస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్