
సైదాపురం మండలంలో ప్రజాదర్బార్ కార్యక్రమం
సైదాపురం మండలంలోని మండల పరిషత్ కార్యాలయం నందు బుధవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన వినతిపత్రాలను స్వీకరించి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి బుధవారం నిర్వహించే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.