

వెంకటగిరి: మున్సిపాలిటీ సిబ్బందిపై అసహనం
వెంకటగిరి మున్సిపాలిటీ సిబ్బంది తీరుపై బొగ్గులు మిట్ట ప్రాంత ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బొగ్గులు మిట్టలోని పలు డ్రైనేజి కాలువల్లో చెత్త, వ్యర్ధాలను ఈ నెల 19న మున్సిపల్ సిబ్బంది తొలగించారనే కాని పూడికను ఎత్తలేదని స్థానిక ప్రజలు తెలిపారు. పూడికను డ్రైనేజి పక్కనే వదిలేయడం వలన దుర్వాసనతో పాటు రాత్రులలో దోమలు, విషకీటకాలు సంచారం పెరిగి పిల్లలకు ప్రమాదం ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.