వెంకటగిరిలో చికెన్ ధర రూ. 210
తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఆదివారం చికెన్ కిలో రూ. 210గా ఉంది. నాటు కోడి ధరలు కొన్ని ప్రాంతాల్లో ఏకంగా కిలో రూ. 600పైగా ఉన్నట్లు సమాచారం. ఇక పొట్టేలు మాంసం ధర రూ. 700, మేకపోతు మాంసం ధర కిలో రూ. 800 వరకు ఉంది. ఆదివారం మాంసం విక్రయాలకు ఉన్న డిమాండ్ చెప్పనవసరం లేదు. సామాన్యులు ఆదివారం రోజైనా మాంసం తినాలని కోరుకుంటారు. పెరిగిన ధరలతో ప్రజలు అటువైపు కన్నెతి కూడా చూడటం లేదు.