విద్యుత్‌ శాఖ ఏఈకి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ బెదిరింపులు

53చూసినవారు
విద్యుత్‌ శాఖ ఏఈకి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ బెదిరింపులు
AP: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో విద్యుత్‌ శాఖ ఏఈగా పని చేస్తున్న మురళీకృష్ణను ఫోన్‌ చేసి బెదిరించారు. తన ఇంటికి విద్యుత్‌ కనెక్షన్‌ తొలగించడంపై ఆగ్రహించారు. "ఆయన.. టెక్కలి నుంచి పారిపోయేలా చేస్తానని ఏఈని హెచ్చరించారు. ఒక ఎమ్మెల్సీ ఇంటికి వచ్చి విద్యుత్‌ కట్‌ చేయడానికి నీకు ఎంత ధైర్యం. ఎవరితో పెట్టుకుంటున్నావ్‌. కోర్టుకు లాగుతాను" అని దువ్వాడ బెదిరించినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్