AP: వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వర్రా రవీందర్ రెడ్డికి జగ్గయ్యపేట కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో ఆయనను జగ్గయ్యపేట సబ్ జైలుకు తరలించారు. చంద్రబాబు, పవన్‌పై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టారని జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు పోలీసులు వర్రా రవీందర్ రెడ్డిను పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్నారు.