బొబ్బిలి పట్టణంలో అభ్యుదయ విద్యాసంస్థలు మరియు అభ్యుదయ సేవ సంస్థ ఆధ్వర్యంలో గురువారం జరిగిన స్వచ్ఛంద రక్తదాన శిబిరం విజయవంతమైంది. గౌడవీధి హై స్కూల్ క్యాంపస్లో 105 మందికి పైగా రక్తం సేకరించారు. అభ్యుదయ సేవ సంస్థ వ్యవస్థాపకులు యం. కూర్మినాయుడు, అధ్యక్షురాలు డా. చింత శారద, "ప్రతి మూడు నెలలకు రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్నవారికి పునర్జన్మ ఇవ్వవచ్చు" అని తెలిపారు. యువత అధికంగా పాల్గొనడం శుభం అన్నారు.