మెంటాడ తహశీల్దార్ ఆవరణలో గురువారం తహశీల్దార్ కోరాడ శ్రీనివాసరావు జెండా ఎగురవేసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఎన్నో ప్రాణత్యాగాలు చేసి స్వాతంత్ర్యాన్ని తీసుకువచ్చిన మహనీయుల సేవలను భారత దేశ పౌరులు ఎప్పటికి గుర్తించుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలోడీటీ వెంకటరావు, రెవిన్యూ, పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.