గజపతినగరం మండలం గంగచోళ్లపెంట గ్రామంలో ఆదివారం ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బోని సంగమయ్య పారిశుద్ధ్య పనులను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆలోచన చేసి ఇ వీధుల్లో ఉన్న కాలవలో చెత్త వేయకుండా చూసే బాధ్యత తీసుకోవాలన్నారు. చెత్త వేయడం వల్ల అనేక రోగాలు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు.