ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీ జీఈఏ) నెల్లిమర్ల తాలూకా యూనిట్ ఐదవ వార్షికోత్సవం నెల్లిమర్ల పట్టణంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ఉపఖజానా కార్యాలయంలో సంఘం పతాకాన్ని సంఘం అధ్యక్షుడు పి వీరన్నదొర ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసోసియేట్ ప్రెసిడెంట్ జి చక్రవర్తి, సెక్రటరీ శివప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ టి వెంకటరావు, వైస్ ప్రెసిడెంట్ జెవి లీల పాల్గొన్నారు.