ఎస్ కోట మండలంలో మారిన వాతావరణం

58చూసినవారు
గత మూడు రోజుల నుండి ఎస్ కోట మండలంలో ఎడతెరిపిలేని వర్షాలు కురవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం నాటికి మండలంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. 12 గంటల సమయానికి ఆకాశంలో మబ్బులు వీడి వాతావరణం ప్రకాశవంతంగా మారి, ఎండ పుష్కలంగా కాస్తుంది. దీంతో నిన్నటి వరకు ఇళ్ళకే పరిమితమైన ప్రజలు వారివారి దైనందిక కార్యక్రమాల్లో బిజీగా గడుపుతుండగా, రైతులు పొలం పనుల్లో బిజీగా గడుపుతున్నారు.

సంబంధిత పోస్ట్