ఎస్ కోట మేజర్ పంచాయతీలో ముమ్మరంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు
ఎస్. కోట మేజర్ పంచాయతీలో గురువారం సర్పంచ్ సంతోషి కుమారి ఆధ్వర్యంలో ముమ్మరంగా పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టారు. ఈ మేరకు పంచాయతీ పరిధిలో స్థానిక మాయలోడు చెరువు సమీపంలో భారీగా పేరుకుపోయిన పూడికను జెసిబి యంత్రం సహాయంతో ఈవో అనురాధ, సానిటరీ ఇన్స్పెక్టర్ ఎం వి ఆర్ ఎల్ ఎస్ ప్రసాద్ ఆధ్వర్యంలో తొలగించారు. పంచాయతీ పరిధిలో ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడమే తన లక్ష్యమని సర్పంచ్ సంతోషి కుమారి అన్నారు.