ఈ నెల 24వ తేదీన రానున్న దానా తుపానుపై అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని తహశీల్దార్ యం. శ్రీను అన్నారు. మంగళవారం బొబ్బిలి మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో విఆర్‌ఒలు, కార్యదర్శిలు, నీటి పారుదల శాఖ అధికారులు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో సమావేశ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తుపానుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, రైతుకు తగు సూచనలు చెయ్యాలని అన్నారు.