రాజ్యాంగ నిర్మాత డా. బి ఆర్ అంబేద్కర్ ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా గో బ్యాక్ అంటూ వామపక్ష నేతలు నిరసన తెలిపారు. రాష్ట్ర పర్యటనకు వస్తున్న అమిత్ షా గో బ్యాక్ అంటూ సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో జెండామాల్ జంక్షన్లో ఆదివారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా సీపీఎం, సీపీఐ నాయకులు పి. శంకరరావు, గోపాలం, శ్రీనివాసరావు, శ్రీనివాస్, అప్పన్న మాట్లాడుతూ పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ ను అమిత్ షా అవమానించారన్నారు.