బొబ్బిలి: అన్నపూర్ణ"కు రేపటికి సంవత్సరం పూర్తి

75చూసినవారు
బొబ్బిలి: అన్నపూర్ణ"కు రేపటికి సంవత్సరం పూర్తి
బొబ్బిలి మండలం కోమటి పల్లి గ్రామంలో "అన్నపూర్ణ ఆపన్న హస్తం" ద్వారా వృద్ధులకు ఆహార పంపిణీ కార్యక్రమం రేపటికి ఒక సంవత్సర కాలం పూర్తి అవుతోందని నిర్వాహకులు బొంతలకోటి లక్ష్మి శంకర రావు శనివారం ప్రకటించారు. ఒక సంవత్సరాన్ని పురస్కరించుకుని రేపు గ్రామంలోని వృద్ధులకు, పారిశుధ్య కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. కార్యక్రమానికి సహకరించిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్