బొబ్బిలి మున్సిపాలిటీ మల్లమ్మపేటలో మంగళవారం పిచ్చికుక్క వీరంగం సష్టించింది. ఐదుగురిపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచింది. స్వైర విహారం చేస్తున్న పిచ్చి కుక్కను తరిమెందుకు వెళ్లిన వారిపై కూడా దాడి చేసింది. ఈ దాడిలో భవన నిర్మాణ కార్మికుడు రఘు తీవ్రంగా గాయపడ్డారు. పిచ్చికుక్కను స్థానికులు కొట్టి చంపేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు స్పందించి వీధి కుక్కలకు టీకాలు వేయించాలని కోరుతున్నారు.