బొబ్బిలిలో ఉత్సాహంగా కోలాటం పోటీలు

64చూసినవారు
బొబ్బిలి శ్రీ కళాభారతి ఆడిటోరియంలో ఉత్తరాంధ్ర స్థాయి కోలాటం పోటీలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు అధిక సంఖ్యలో విచ్చేసి తమ ప్రతిభను చూపిస్తున్నారు. వివిధ జానపద గేయాలకు కోలాటం నృత్యాలు చేస్తున్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన కళాకారులకు బహుమతులను ప్రధానం చేస్తామని నిర్వాహకులు వేణుగోపాలరావు, మోహన్ రావు తెలిపారు.

సంబంధిత పోస్ట్