శ్రీ దాడి తల్లి అమ్మవారి ప్రత్యేక పూజలు ప్రారంభం

81చూసినవారు
శ్రీ దాడి తల్లి అమ్మవారి ప్రత్యేక పూజలు ప్రారంభం
బొబ్బిలి మున్సిపాలిటీ గొల్లపల్లి బైపాస్ రోడ్డు నందు వెలసిన శ్రీ శ్రీశ్రీ దాడి తల్లి అమ్మవారి ఆలయంలో గురువారం వేకువజాము నుండి దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. శ్రీ దాడి తల్లి అమ్మవారికి అర్చకులు పిండిప్రోలు మణికుమార్ శర్మ ఆధ్వర్యంలో కుంకుమ పూజలు నిర్వహించడం జరిగింది. స్త్రీలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని కుంకుమతో అర్చించి అనంతరం తీర్థ ప్రసాదం స్వీకరించారు.

సంబంధిత పోస్ట్