కొత్తవలస మంగళపాలెంలోని సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 37వ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు విద్యార్థులకు చదువులో శ్రద్ధ వహించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. విద్యార్థుల ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఎంఈవో శ్రీదేవి, ఎస్ఐ సుదర్శన్, కల్నల్ నీరజ్ కుమార్, ప్రిన్సిపాల్ సుధారాణి, సిబ్బంది పాల్గొన్నారు.