గరివిడి మండలం కె. పాలవలస గ్రామంలో "పొలం పిలుస్తుంది " కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో ఎంపీపీ యం. విశ్వేశ్వరరావు, గ్రామ సర్పంచ్ విఎఏ మధు, ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలు టి. సుశీల, రామకృష్ణ గార్ల ఆధ్వర్యంలో రైతులకు అవగాహనా సదస్సు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ప్రకృతి వ్యవసాయం కాషాయాలు, ద్రావణలు వాటి తయారీ, ఉపయోగం, భూసారం, గురించి మాట్లాడడం జరిగింది.