చీపురుపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ వైద్యం సక్రమంగా అందే విధంగా చూడాలని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యదర్శి రామ్ మల్లికినాయుడు అన్నారు. గురువారం చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆయన పర్యటించారు. ఆయనతోపాటు నాలుగు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.