బొండపల్లి మండలం రుద్రపాలెం గ్రామంలో వెలసిన శ్రీ పైడితల్లి అమ్మవారిని గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఎంపీపీ చల్ల చల్లంనాయుడు తదితరులు పాల్గొన్నారు.