బొండపల్లి రైతు సేవా కేంద్రాన్ని జెసి సేతు మాధవన్ శనివారం సందర్శించారు. రైతు సేవా కేంద్రంలో రికార్డులను తనిఖీ చేశారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులకు సకాలంలో ట్రక్ సీట్లు జనరేట్ చేసి, ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో డబ్బులు జమయ్యే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. తాసిల్దార్ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.